
Ambedkar Youth Association : త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి.. గోదావరిఖనిలోని 52వ డివిజన్, కాకతీయ నగర్ మాదిగ బస్తికి చెందిన యువకులందరూ కలిసి ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కమిటీకి “కాకతీయ నగర్ మాదిగ వాడ అంబేద్కర్ యూత్ అసోసియేషన్” గా నామకరణం చేసి, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కమిటీ సభ్యుల వివరాలు అధ్యక్షుడు తోకల ప్రశాంత్ ఉపాధ్యక్షులు బీర్నేని అభిలాష్, తాండ్ర శివ కుమార్ …ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి రాకేష్.. సంయుక్త కార్యదర్శి కనుకుంట్ల విష్ణు చరణ్ కోశాధికారిఒంటేరు మనోజ్ కుమార్ కార్యదర్శి జిల్లాల అక్షయ్
ప్రచార కార్యదర్శి: ఇందారపు వర్ధన్… కార్యవర్గ సభ్యులు: సప్పిడి వేణు, ఇందారపు అశోక్,తోటపల్లి శేఖర్, అంకిళ్ల భరత్, చిలుముల అశోక్, ఉరుసు సునీల్, ఇందారం వర్షిత్, పోరేటి యశ్వంత్ ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తోకల ప్రశాంత్ మాట్లాడుతూ.. “భవిష్యత్తులో మాదిగవాడ అభివృద్ధితో పాటు, మాదిగ జాతి ఆత్మగౌరవం కోసం అందరం ఐక్యంగా, నిర్దిష్టమైన కార్యాచరణలతో ముందుకు వెళ్తామని” వారు స్పష్టం చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

