
Five Students Drowned : త్రినేత్రం న్యూస్ : భద్రాచలం:- భద్రాచలం పట్టణ శివారు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న విషాద సంఘటన…. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థులు… శుక్రవారం మధ్యాహ్నం గోదావరిలోకి స్నానానికి దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతు… గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు… ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా మరో రెండు మృతదేహాల కోసం గాలింపు….
భద్రాచలానికి చెందిన ఇద్దరు విద్యార్థులతో పాటు ఏపీ రాజధాని అమరావతిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు…. నాలుగు రోజులు వారాంతపు సెలవులు రావడంతో భద్రాచలానికి చెందిన స్నేహితులతో కలిసి భద్రాచలం వచ్చిన విద్యార్థులు….. గల్లంతైయిన విద్యార్థులు సతీష్ మదనపల్లి,నవదీప్ ఉయ్యూరు,తేజజ్ఞ ఉయ్యూరు,అభిరామ్,శ్రీకర్ భద్రాచలం గా గుర్తింపు… భద్రాచలానికి చెందిన శ్రీకర్, అభిరామ్, ఉయ్యూరు కు చెందిన నవదీప్ మృతదేహాలు లభ్యమ్.. తమ వారి మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

