
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం .
బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ
Boddupalli Krishna : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో విద్యారంగంకు అన్యాయం జరిగింది అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ……ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని ఆయన అన్నారు.
మొత్తం రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లలో విద్యారంగానికి కేటాయించిన మాత్రం కేవలం 26,674 కోట్లు (8శాతం) ఇది కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మొదటి బడ్జెట్లో 15శాతం కేటాయింపు చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా ఈ బడ్జెట్లో కూడా విస్మరించింది అని ఆయన తెలిపారు.కనీసం 10 శాతానికి కూడా చేరుకోకపోవడం ప్రభుత్వం మాటలకూ, చేతలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బహిర్గతం చేస్తోంది అని ఆయన అన్నారు.ఉన్నత విద్యపై సవతి తల్లి ప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తోంది అని ఆయన అన్నారు.
బడ్జెట్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై ప్రభుత్వం రూ.4,343కోట్లు కేటాయింపు చేస్తామని చెప్పారు,కానీ గత బకాయిలు భారీగా పేరుకుపోయిన వాటి గురించి ప్రస్తావన లేదు.ఈ సంవత్సరం ఫీజులు మళ్ళీ అదనంగా ఉంటాయి.సుమారు రూ. 9,500 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినా, వాటి చెల్లింపుపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని ఆయన అన్నారు.బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన నియామకాల సంఖ్యలు వాస్తవానికి గతంలో ప్రారంభమైన ప్రక్రియలే తప్ప కొత్త అవకాశాలు కావని స్పష్టం చేసింది.
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన అన్నారు.బడ్జెట్లో 100 కోట్లు రెనోవేషన్ కోసం కేటాయింపు చేశారు అని 100 కోట్లతో హస్టల్స్ ఎలా బాగుపడతాయని ఆయన అడిగారు.గురుకుల అద్దె భవనాలు, కెజిబివిలు అదనపు బిల్డింగ్స్, సంక్షేమ వసతిగృహాల మౌళిక సదుపాయాలు ఈ అంశాలపై సరైన ప్రస్తావన లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. విద్య రంగానికి బడ్జెట్ పెంచాలని గత బడ్జెట్ కు ఈ బడ్జెట్ కు పెంచినట్లు కనిపించేది కానీ విద్యకు తీవ్ర మెండిచెయ్యి చుపారని అని అన్నారు.తక్షణమే బడ్జెట్ సవరించి విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 30శాతం నిధుల కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల తక్షణ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా మాటలకే పరిమితం కాకుండా, విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

