Dawat-e-Iftar : రంజాన్ మాసం సందర్భంగా డిండి లో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం

TRINETHRAM NEWS
Daawat-e-Iftar program

డిండి ఎం ఆర్ ఓ. శ్రీనివాస్ గౌడ్.

Dawat-e-Iftar : డిండి (గుండ్ల పల్లి) మార్చ్ 18, త్రినేత్రం న్యూస్.. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిండి మండల కేంద్రంలో నేడు ఘనంగా నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో డిండి మండల తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ ప్రార్థనల్లో పాల్గొని, ప్రజలు శాంతి-సమృద్ధులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ రంజాన్ మాసం అనేది త్యాగం, సహనం, దాతృత్వం మరియు సోదరభావాన్ని పెంపొందించే పవిత్రమైన నెల అని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్ష సమాజానికి ఆత్మ నియంత్రణ, పరస్పర సహకారం వంటి విలువలను నేర్పుతుందని తెలిపారు.

అనంతరం తహసిల్దార్ , మరియు స్థానిక ఎస్ ఐ బాలకృష్ణ పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top