
CM Chandrababu : పోలవరం జిల్లా : మార్చి 18 : (త్రినేత్రం న్యూస్); పోలవరం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పునరావాస పరిహార ప్యాకేజీ మూడు విడతల్లో భాగంగా వాళ్లకు రూపాయలు రెండు వందల ఇరవై ఆరు చెక్కును అందించారు. అనంతరం మాట్లాడుతూ ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనారి అని గుర్తు చేశారు. అదేవిధంగా నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు.
గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోకుండా, వరదల్లో మునిగిపోతున్న నిర్లక్ష్యంగా వదిలేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలందరని కులం, మతం, భాష, పార్టీ భేదం లేకుండా సమన్వయంగా చూస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలు అందాయని రాష్ట్ర ప్రజలందరూ ఈ ప్రభుత్వంపై అభినందనలు తెలియజేస్తున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

