A T. Krishna : ప్రజల ఇబ్బందులు లేకుండా ఎల్పీజీ సరఫరా

TRINETHRAM NEWS
A T. Krishna LPG supply

A T. Krishna : డిండి (గుండ్ల పల్లి) మార్చ్ 18, త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ ఏ టి . కృష్ణ నిర్వహించినటువంటి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ … ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో కూడా దేశ ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటోంది. భారతీయ జనతా పార్టీ హయాంలో ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి కుటుంబానికి గ్యాస్ అందుబాటులో ఉండేలా కృషి కొనసాగుతోందిఅని అన్నారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం అంతర్జాతీయ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ, అవసరమైన గ్యాస్ సరఫరా మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకుంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవే. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి చర్యలు తీసుకుంటోందనీ పేర్కొన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంధన రంగంలో స్థిరత్వం లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం సంక్షోభ సమయంలో కూడా ప్రజలపై భారం పడకుండా, సరఫరా వ్యవస్థను బలపరుస్తోంది అని, ప్రజలు నిజాలను గుర్తించి, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను నమ్మకుండా దేశ అభివృద్ధికి తోడ్పడే విధానాలకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము అని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top