
బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ… టిడిపి మైనార్టీ నాయకులు ఇమ్రాన్ , కొండ సుబ్బయ్య
Ramzan : కడప మార్చి 17 : పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని టిడిపి మైనార్టీ నాయకులు ఇర్ఫాన్, టిడిపి నగర ఉపాధ్యక్షులు కొండ సుబ్బయ్య ల ఆధ్వర్యంలో ఎన్ టి ఆర్ సర్కిల్ నందు రంజాన్ మాసం సందర్భంగా దాదాపు 500 మందికి బిర్యాని ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి మైనార్టీ నాయకులు అమిర్ బాబు, టిడిపి సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి అమీర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరం ఒక్కటని, అందరం సోదర భావంతో మెలగాలనే ఆలోచనతోనే ఈ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.
సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందువల్ల మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు.అలాగే ముస్లిం సోదరులందరూ ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లా మన్ననలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకురాలు దేవి,కటారి స్వర్ణలత, జీవన్ ఫాల్, రవి, శివా, దస్తగిరి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

