
CM Chandrababu : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు విచ్చేసి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు. ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబు ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క–నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు.
గత మార్చి 5వ తేదీన సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భట్టి విక్రమార్క స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే అప్పట్లో ఉన్న అత్యవసర కార్యక్రమాలు, బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు వివాహానికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే నేడు ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు విచ్చేసి నూతన దంపతులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

