Women be Careful : మహిళలు మీ గుండె ఆరోగ్యం పట్ల బీ కేర్ ఫుల్…..మహిళలకు పెనుముప్పుగా మారుతున్న ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్!

TRINETHRAM NEWS

భారతదేశంలో మహిళల మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణం

మహిళల్లో విభిన్నంగా ఉండే హార్ట్ ఎటాక్ లక్షణాలు

మెనోపాజ్ తర్వాత తగ్గే ఈస్ట్రోజెన్ హార్మోన్ రక్షణ

అధిక రక్తపోటు, ఊబకాయంతో పెరుగుతున్న ముప్పు

జీవనశైలి మార్పులతోనే గుండె ఆరోగ్యం పదిలం

Trinethram News : గుండెపోటు అనగానే సాధారణంగా పురుషులకే వస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. కానీ వాస్తవానికి ఇది మహిళల ప్రాణాలకు కూడా పెనుముప్పుగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం.. 2021లో భారతదేశంలో కొవిడ్-19 తర్వాత మహిళల మరణాలకు ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ (ఐహెచ్ డీ)’ రెండో ప్రధాన కారణమని తేలింది. ఆ ఏడాది లక్ష మందిలో 159.9 మంది కొవిడ్ వల్ల మరణించగా, 99.4 మంది ఈ గుండె జబ్బు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్‌నే కరోనరీ హార్ట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడలలో కొవ్వు పదార్థం (ప్లాక్) పేరుకుపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కాలక్రమేణా రక్తనాళాలు సన్నబడి, రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Women, be careful about your heart health

You cannot copy content of this page

Scroll to Top