Cyber ​​Criminals : రిటైర్డ్ జడ్జి డిజిటల్ అరెస్ట్.. రూ. 1.66 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

TRINETHRAM NEWS

Trinethram News : మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసు పేరుతో రిటైర్డ్ జడ్జికి సైబర్ నేరగాళ్ల మోసం… వీడియో కాల్ చేసి తాము CBI అధికారులమని భయపెట్టి డిజిటల్ అరెస్ట్… విచారణ జరుగుతుందని చెప్పి ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక

మీ ఆధార్ కు లింక్ అయి ఉన్న రెండు మొబైల్ నెంబర్లు మహిళలకు అభ్యంతర కాల్స్ చేస్తున్నారని మాజీ జడ్జిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు…. బెంగళూరులోని ఇందిరానగర్ లో మీపై కేసు నమోదు అయిందని భయభ్రాంతులకు గురిచేసిన సైబర్ కేటుగాళ్లు.. మీపై మానవక్రమ రవాణా కేసు కూడా నమోదు అయిందని సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారింట్ జారీ చేసిందని కాల్ చేసి బెదిరింపులు…

ఈ విషయాలపై కుటుంబ సభ్యులు గాని స్నేహితులతో కానీ చర్చించవద్దని డిజిటల్ అరెస్ట్ చేసిన నిందితులు… మీ బ్యాంకు ఖాతాలు వివరాలు ఇవ్వాలని భయపెట్టి, మీరు చెల్లించే మొత్తం విచారణ తర్వాత తిరిగి ఇస్తామని మస్కా

అరెస్టు చేస్తే ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని భయపడి రూ.1.66 కోట్లు సైబర్ మోసగాళ్లకు బదిలీ చేసిన రిటైర్డ్ జడ్జ్… మోసగాళ్లు చెప్పిన విధంగా నగదు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జ్… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేరెడ్‌మెట్ పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Retired judge digitally arrested

You cannot copy content of this page

Scroll to Top