Meda Srinivas : 2027 పుష్కరాల ముహూర్తం మార్పు చేయాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, రాజమండ్రి, రాబోయే 2027 పుష్కరాల ముహూర్తం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి మార్పు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు మేడా శ్రీనివాస్ కోరారు. ప్రస్తుతం నిర్ణయించిన పుష్కల ముహూర్తం తప్పు అని గుర్తించి దాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
రాజమండ్రి పుష్కరాలు కేవలం రాజమండ్రి ప్రాంతానికే పరిమితం కావని, కోనసీమలోని అంతర్వేది వరకు విస్తరించి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనులపై ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి సమగ్రంగా చర్చించాలని ఆయన సూచించారు.
పుష్కరాల ఏర్పాట్లలో ప్రజల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

2027 Pushkara Muhurat should be changed

You cannot copy content of this page

Scroll to Top