గుంటూరు జిల్లా : అమరావతి : మార్చి 7: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం వైసిపి పాలనలో అక్రమ మద్యం కారణంగా వేల కుటుంబాలు నాశనమయ్యాయి అని అన్నారు.
అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనుచరల జేబుల్లో వేలకోట్లు చేరాయని ఆరోపించారు. కోట్ల రూపాయల నగదు , లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడి బయట పెట్టిందని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ స్పందించకపోవడమే జగన్ సమాధానమా ! అని నిలదీశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


