చింత పల్లి ఫిబ్రవరి 22, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం గొల్లపల్లిలోని సీ ఎం ఆర్ ఇటుక బట్టీలో వెట్టిచాకిరి చేస్తున్న 109 మంది ఒరిస్సా వలస కూలీలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సరైన వేతనాలు అందక దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న కూలీల పరిస్థితిపై లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు అందింది.
జిల్లా జడ్జి ఆదేశాలతో దేవరకొండ సీనియర్ సివిల్ జడ్జి కె. అనిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి. స్నేహ మరియు ఆర్డీఓ బట్టీని సందర్శించి విచారణ చేపట్టారు. బాధితుల్లో 23 కుటుంబాలకు చెందిన 109 మందిని గుర్తించి పోలీస్ ఎస్కార్ట్‌తో నల్గొండకు తరలించారు.
కూలీలను వారి స్వస్థలాలకు (ఒరిస్సాలోని బోలంగిరి జిల్లా) పంపేందుకు ఏర్పాట్లు చేశారు. వలస కార్మికుల హక్కులను కాలరాసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


