SP Sneha Mehra : ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు,- ఎస్పీ .స్నేహ మెహ్ర

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపినారు.

ఎన్నికల ఓట్ల లెక్కింపు దృష్ట్యా, జిల్లాలోని నాలుగు మునిసిపల్ పట్టణాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో, అలాగే కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో,విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం, డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగం పూర్తిగా నిషేధించబడినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఫలితాలు వెలువడిన అనంతరం కూడా ప్రజలు సంయమనం పాటించాలని, ఉత్సాహంలో ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడవద్దని ఎస్పీ తెలిపినారు.

అదేవిధంగా, కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో నిర్దిష్ట పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సెక్షన్ అమలులో ఉన్న సమయంలో ఐదుగురికి మించి గుమికూడడం, నినాదాలు చేయడం, లౌడ్ స్పీకర్లు, డీజేలు, సౌండ్ బాక్స్‌లు లేదా ఇతర శబ్ద విస్తరణ పరికరాల వినియోగం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద కదలికలపై నిఘా కోసం ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్,అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, డీజే యజమానులు, ఈవెంట్ నిర్వాహకులు మరియు వారి అనుచరులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా పూర్తయ్యేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ తెలియజేయడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ensure peaceful conduct of vote counting process

You cannot copy content of this page

Scroll to Top