Workers’ Strike : లేబర్ కోడ్ రద్దు డిమాండ్ తో దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె అరకు వ్యాలీలో విజయవంతం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ ఫిబ్రవరి 13 (త్రినేత్రం న్యూస్): కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో 12వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మె విజయవంతమైంది.
ఈ సమ్మెలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ ప్రాంతంలో సంపూర్ణ బంద్ వాతావరణం నెలకొంది.వ్యాపార సంస్థలు, షాపులు, ప్రైవేట్ కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి.పర్యాటక కేంద్రాలైన పద్మాపురం గార్డెన్, చాపరాయి, ట్రైబల్ మ్యూజియం కూడా మూసివేశారు.
ఈ సమ్మెకు వ్యాపార సంఘాలు,రైతుసంఘాలు, కూలి సంఘాలు,మోటార్ కార్మికులు,గిరిజనసంఘలు,పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ప్రధాన డిమాండ్లు నాలుగు లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలి విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి.కనీస వేతనం నెలకు రూ.30,000 చేయాలి అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వీవోఏ, ఏఆర్పి వంటి స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఆటో, బిల్డింగ్ వర్కర్లు, తోపుడు బళ్ళు, గిగ్ వర్కర్లకు పీఎఫ్,

ఈఎస్ఐ, ఇన్సూరెన్స్‌తో కూడిన సమగ్ర చట్టం చేయాలి విద్యుత్ సవరణ, విత్తనాల సవరణ బిల్లులను రద్దు చేయాలి.ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పులను రద్దు చేసి, పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలి,ఏడాదికి 200 రోజులు పని కల్పించాలి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి అంటూ సీఐటీయూ నేతల ఆగ్రహం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ
“ఈ నాలుగు లేబర్ కోడ్ అమల్లోకి వస్తే కార్మికులకు ఎటువంటి హక్కులు ఉండవు. ఇప్పటివరకు జీతాలు పెంచమని అడిగే హక్కు, ధర్నాలు చేసే హక్కు, సమ్మె చేసే హక్కు ఉండేది. ఇప్పుడు అవన్నీ ఉండబోవు అని 8 గంటల పని దినాన్ని 12 గంటలుగా మార్చడం కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నమే. కార్పొరేట్ల లాభాల కోసం కార్మికుల జీవితాలను తాకట్టు పెట్టడం దుర్మార్గం” అని విమర్శించారు.
గిరిజన సంఘం నాయకుడు పొద్దు బాలదేవు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి, అలానే“రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి. 100 శాతం డీఎస్సీ, 100 శాతం ఉద్యోగ భద్రత, గిరిజన హక్కుల పరిరక్షణ, హైడ్రోపవర్ ప్రాజెక్టు రద్దు వంటి డిమాండ్లతో ఈ సమ్మెలో భాగస్వాములమయ్యాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సురేంద్ర, రామారావు, భగత్ రాం, చిన్నబాబు తదితర నాయకులతో పాటు వ్యాపార, రైతు, మోటార్ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Workers' strike across the country

You cannot copy content of this page

Scroll to Top