Rahul Gandhi : భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు

TRINETHRAM NEWS

Trinethram News : Feb 09, 2026, మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే పుస్తకం అంశం భయపడటం వల్లే ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభకు రావట్లేదని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ఆ తీర్మానాన్ని సభ ఆమోదించింది.

ఎంపీల వల్ల ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తల్లో నిజం లేదని, ఎవరైనా మోదీని బెదిరిస్తే వారిపై FIR నమోదు చేయాలని రాహుల్ గాంధీ అన్నారు.

అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో భయపడుతున్న ప్రభుత్వం, బడ్జెట్‌లో చర్చకు వణుకుతోందని ఆయన విమర్శించారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే పుస్తకం పట్ల మోదీకి భయం ఉందని, తమ వద్ద ఆ పుస్తకం కాపీ ఉందని రాహుల్ గాంధీ వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

PM Modi not coming to Lok Sabha due to fear

You cannot copy content of this page

Scroll to Top