Cancer Awareness Conference : ఆర్ ఎస్ ఆర్ లో క్యాన్సర్ పై అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 4: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం… బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం రోజు వరల్డ్ క్యాన్సర్స్ డేని పురస్కరించుకొని కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం సంయుక్తంగా క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించామని ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు.

వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నెల్లూరులో గల ప్రముఖ హాస్పిటల్ అయిన మెడికవర్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రముఖ డాక్టర్లైన ,డాక్టర్ మౌనిక రెడ్డి. వై మరియు డాక్టర్ పునుగోటి గౌతమ్ , పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

డాక్టర్లు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధినిర్ధారణకు ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, నివారణ ఎలా చేసుకోవాలి, వ్యాధిని పూర్తిగా నివారించుకోవడానికి ప్రస్తుతం భారతదేశంలో గల నివారణ సౌకర్యాలు గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మెడికవర్ మెడికల్ సిబ్బందితో పాటు కళాశాల ఏవో ఆర్వి రమణారెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఏ కిరణ్ కుమార్, అన్ని విభాగాల అధిపతులు అధ్యాపకులు తదితరులు కూడా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cancer Awareness Conference in RSR

You cannot copy content of this page

Scroll to Top