Trinethram News : మేడారం జాతర నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతర ఏర్పాట్లలో లోపాలపై ప్రశ్నలు ఎదురవుతాయని ముందే అంచనా వేసిన మంత్రి సీతక్క మీడియాకు ముఖం చాటేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతర ముగిసిన అనంతరం జరగాల్సిన ప్రెస్‌మీట్‌ను ఆమె అకస్మాత్తుగా రద్దు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భక్తులకు కనీస వసతులు కూడా సరిగా కల్పించలేదని జాతరకు వచ్చిన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని విమర్శలు వినిపించాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు బహిరంగంగానే దుమ్మెత్తి పోశారు.
మీడియా ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకే మంత్రి సీతక్క ప్రెస్‌మీట్‌ను క్యాన్సిల్ చేశారని సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. “జాతర విజయవంతమైందని ప్రభుత్వం భావిస్తే, మీడియా సమావేశాన్ని ఎందుకు రద్దు చేశారు?” అని వారు నిలదీస్తున్నారు.
రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తింపు పొందినప్పటి నుంచి మేడారం జాతర ముగిసిన తరువాత మంత్రి మీడియా సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి సంప్రదాయాన్ని ఈసారి విస్మరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మొత్తం మీద మేడారం జాతర నిర్వహణపై ప్రభుత్వ వైఫల్యం మరోసారి బహిర్గతమైందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


