అరకులోయ ఫిబ్రవరి 1, (త్రినేత్రంన్యూస్): అరకు ఫెస్ట్‌లో భాగంగా మూడవ రోజు పద్మాపురం గార్డెన్‌లో ప్రత్యేక ‘ఐ లవ్ అరకు’ పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ ప్రారంభించారు.
ప్రదర్శనలో పూలతో సృజించిన వివిధ ఆకృతులు పర్యాటకులను మంత్రముగ్ధులుగా చేస్తాయని కలెక్టర్ తెలిపారు. అరకు లోయ సుందరతను ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేయబడిందని ఆయన చెప్పారు.అరకు పర్యాటకులు, ఫోటోగ్రఫీ ప్రేమికులు మరియు పర్యాటకులందరికీ ఈ పుష్ప ప్రదర్శన విశేష ఆకర్షణగా నిలవనుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో అరకు నియోజవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం, ఆర్‌టీసీ రీజనల్ చైర్మన్ దొన్నుదొర, ఎస్టీ కమిషన్ సభ్యుడు సాయిరాం, బొంజుబాబు, జాయింట్ కలెక్టర్ ఐటిడిఎ పివో తిరుమణి శ్రీ పూజ, పాడేరు ఇంచార్జ్ ఆర్డివో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎమ్.వి.ఎస్. లోకేశ్వరరావు, పద్మాపురం పంచాయతీ సర్పంచ్ పర్యాటక సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


