75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

TRINETHRAM NEWS

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ లో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, సురేష్ రెడ్డి,ఆవుల పావని, కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం వారు విద్యలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, హెడ్ మాస్టర్ చేతుల మీద బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుభవం కలిగిన ఉపాధ్యాయలతో మంచి విద్యను అందిస్తున్న జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ వారికీ అభినందనలు తెలిపి, విద్యార్థులు చదువుతో పాటు, ఆట పాటలతో క్రమశిక్షణతో మెదిలి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోజడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పళ్ళ రఘునాథ్, సీనియర్ నాయకులు, నాయకులు యువ నాయకులు, స్థానిక నాయకులు, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top