Kolan Hanmanth Reddy : పాలు డివిజన్ తాగునీటి సమస్యపై HMWSSB ఎండీని కలిసిన కొలన్ హన్మంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పాలు డివిజన్‌లో నెలకొన్న తాగునీటి సమస్యపై HMWSSB ఎండీ గౌరవనీయులు అశోక్ రెడ్డి ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ లైన్ పనులు మరియు ఔట్లెట్‌లకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనిపై ఎండీ సానుకూలంగా స్పందిస్తూ, రానున్న రోజుల్లో సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్ ముదిరాజ్, సిద్దనోల సంజీవరెడ్డి, మైసిగారి శ్రీనివాస్, పద్మారావు, మనోజ్ రెడ్డి, శరత్ చెంద్ర,దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kolan Hanmanth Reddy meets HMWSSB MD

You cannot copy content of this page

Scroll to Top