Kanchi Mahender : అభివృద్ధికి చిరునామాగా కంచి మహేందర్

TRINETHRAM NEWS

స్వంత నిధులతో ప్రజాసమస్యకు పరిష్కారం*

ఎల్‌బీఎస్ నగర్‌లో కంచి మహేందర్ చొరవతో బోరు ఏర్పాటు

కూకట్పల్లి జనవరి 27 (త్రినేత్రం న్యూస్) : ఫతేనగర్ పరిధిలోని ఎల్‌బీఎస్ నగర్ ప్రాంతంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కంచి మహేందర్ మరోసారి తన ప్రజాప్రతినిధి బాధ్యతను చాటుకున్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన కంచి మహేందర్, రైల్వే ట్రాక్ సమీపంలోని ప్రాంతంలో తక్షణమే బోరు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించించారు. ముఖ్యంగా ఈ బోరు పనులను స్వంత ఖర్చులతో నిర్వహించడం ఆయన సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో బాలేశ్ తో పాటు ఎల్‌బీఎస్ నగర్‌కు చెందిన పలువురు స్థానికులు పాల్గొని తమ సహకారం అందించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నీటి సమస్యకు వెంటనే పరిష్కారం లభించడంతో, అక్కడి ప్రజలు కంచి మహేందర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తూ, మాటలకే పరిమితం కాకుండా చర్యల్లో చూపించే నాయకత్వం,కంచి మహేందర్ ని ప్రజలకు మరింత దగ్గర చేస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫతేనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేస్తున్న కృషి,ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kanchi Mahender as an address for development

You cannot copy content of this page

Scroll to Top