Nationwide Strike : కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం

TRINETHRAM NEWS

12 ఫిబ్రవరి దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి-సిపిఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె బిక్షపతి కార్మికులకు పిలుపు

త్రినేత్రం న్యూస్ హనుమకొండ జిల్లా ప్రతినిధి.. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2026 ఫిబ్రవరి 12వ తేదీన చేపట్టనున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా సదస్సు పిలుపునిచ్చింది. దేశ వ్యాప్త సమ్మెను విజయ వంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో హానమకొండ జిల్లా లోని బాలసముద్రం పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగింది.

ఈ సదస్సుకు ఏఐటియుసి హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ కార్యాలయం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె బిక్షపతి విచ్చేసి మాట్లాడుతూ అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టా లను సంపూర్ణంగా రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తోం దని విమర్శించారు. బ్రిటీష్ ప్రభుత్వంలో కార్మికులు అనేక ఉద్యమాలు చేసి 1923లోనే ప్రమాద నష్టపరిహార చట్టం సాధించుకున్నారని, ఈ చట్టం ఇప్పటికీ అమలవుతున్న చట్టాలలో ఒక్కటిగా ఉన్నదన్నారు.

బిజెపి పాలనలో ప్రజల ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందని, నిరుద్యోగం పెరుగుతోందని, సామాన్య ప్రజాస్వామ్య హక్కులపై దాడులు జరుగుతున్నాయని, విద్వేషపూరిత ప్రచారాల నేపథ్యంలో సంఘాలను ఏర్పటుచేసుకునే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. సమ్మె, నిరస నలు తెలియజేసే హక్కును కూడా బిజెపి ప్రభుత్వం అణచివేస్తుందని విమర్శించారు. ఆదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు.

ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్ మాట్లాడుతూ… ఎన్ హెచ్ ఎం నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు సామాన్యుల భూములను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేశా రని, ఫలితంగా కేంద్రం ప్రభుత్వం వెనక్కితగ్గాల్సి వచ్చిం దని, రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సి వచ్చిం దని గుర్తుచేశారు.

విత్తన, విద్యుత్ సవరణ బిల్లులు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యా లను మార్చి, గాంధీ పేరును మార్చి వివిజి రాంజి చట్టం 2025 తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షో భంలోకి నెట్టుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్ముల రామ్మూర్తి, జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, ఉపాధ్యక్షులు లంకదాసరి అశోక్, సహాయ కార్యదర్శలు బత్తిని సదానందం గౌడ్, గుంట రాజేందర్, ఇల్లందుల రాములు , దుర్గాప్రసాద్, అశోక్, రసమల్ల కుమార్, బోట్ల కుమారస్వామి, ఓదేలు, బొట్ల చక్రపాణి, రసమల్ల దీన,రవి, సమ్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Centre trampling on workers' rights

You cannot copy content of this page

Scroll to Top