అల్లూరి జిల్లా అనంతగిరి జనవరి 27, (త్రినేత్రంన్యూస్): అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలో గల చింతలపాలెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకల రోజును కూడా ఉపాధ్యాయుల హాజరు కాకపోవడంతో ఆయా గ్రామాల గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు.
గ్రామానికి చెందిన అప్పలస్వామి, వంతల కృష్ణ అనే యువకులు మాట్లాడుతూ 2025 నవంబర్ నుండి పాఠశాలకు ఉపాధ్యాయులు రావడంలేదని దీనివలన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు.
సుమారు మా గ్రామంలో గల పాఠశాలలో 35 మంది విద్యార్థులు ఉన్నారని ఉపాధ్యాయులు రాకపోవడంతో వీళ్ళ భవిష్యత్తు నాశనమైపోతుందని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓ ఈ సమస్యపై దృష్టి సారించి నెలలు తరబడి విధులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న అధికారులపై చర్యలు తీసుకొని పాఠశాలకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుడు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఏది ఏమైనప్పటికీ గత కొద్ది నెలలుగా ఎస్ఎఫ్ఐ ( స్కూల్ ఫెడరేషన్ ఇండియా ) వారు కూడా అనంతగిరి మండల పరిధిలో గల కొన్ని పాఠశాలలు సందర్శించినప్పుడు కొన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులు రావటం లేదని గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం పలు పత్రికల్లో మీడియాలో కథనాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
కానీ ఏ ఒక్క అధికారిపై కూడా నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం నిజంగా దారుణం అనే చెప్పాలి. మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి గత మూడు నెలల నుండి స్కూలుకు డుమ్మా కొట్టడమే కాకుండా గణతంత్ర వేడుకల రోజున కూడా పాఠశాలకు రాలేని ఉపాధ్యాయులుపై అలాగే గతంలో అనేకసార్లు పలు పత్రికల్లో, మీడియాలో ఉపాధ్యాయులు పాఠశాలకు రావడం లేదని కథనాలు వచ్చినప్పటికీ ఈ సమస్యపై దృష్టి సారించకుండా పర్యవేక్షణ లోపంతో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా లేదా గాలికి వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


