అల్లూరిజిల్లా అరకులోయ జనవరి 23, (త్రినేత్రంన్యూస్): అరకు అందాలను ప్రపంచానికి చాటిచెప్పేలా, స్థానిక గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా “అరకు చలి ఉత్సవ్ – 2026”ను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఉత్సవాల నిర్వహణపై ప్రిలిమినరీ (ముందస్తు) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యాటకులు మరియు ప్రజల భాగస్వామ్యంతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని స్పష్టం చేశారు.
మూడు రోజుల కార్యక్రమాల వివరాలు.. మొదటి రోజు – 30 జనవరి 2026 .. అడ్వెంచర్ & కాంటెంపోరరీ కల్చర్.. సాహస క్రీడలు, ట్రెక్కింగ్ కార్యక్రమాలు, ఆధునిక సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక అడ్వెంచర్ జోన్‌లను ఏర్పాటు చేయనున్నారు.
రెండవ రోజు – 31 జనవరి 2026 యూత్, స్పోర్ట్స్ & ట్రైబల్ లైఫ్ స్టైల్ యువత కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహిస్తారు. గిరిజన జీవనశైలిని ప్రతిబింబించే ప్రదర్శనలు, గిరిజన కళారూపాలు, సంప్రదాయ వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.
మూడవ రోజు – 01 ఫిబ్రవరి 2026 ముగింపు వేడుకలు స్థానిక కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, బహుమతి ప్రధానోత్సవంతో ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి. పర్యాటకులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉత్సవాలకు వచ్చే పర్యాటకుల కోసం రవాణా, తాగునీరు, భద్రత తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నిర్వహణలో భాగస్వామ్య శాఖలు ఈ ఉత్సవాల నిర్వహణలో పర్యాటక శాఖ, డీఆర్‌డీఏ, గిరిజన సంక్షేమ శాఖ, అనంతగిరి, డుంబ్రిగూడ, పాడేరు మండల అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయనున్నట్లు తెలిపారు. అరకు చలి ఉత్సవ్ ద్వారా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి, గిరిజన సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


