త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలంలో పశు వైద్య శిబిరాన్ని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో పశువుల ఆరోగ్యం, ఎదకు రాని పశువులకు ఎలాంటి చికిత్స చేయాలి మొదలగు విషయాలను మండలపశు వైద్య అధికారి సుబ్రహ్మణ్యం చెప్పారు.
అలాగే ప్రభుత్వం ప్రతి పశువుకి బీమా సౌకర్యం కల్పించిందని, రైతులు 15% చెల్లిస్తే మిగతా 85% గవర్నమెంట్ చెల్లించి ప్రతి పశువుకి గరిష్టంగా 30 వేల వరకు భీమా అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత శిబిరాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎమ్మార్వో, సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ నాయుడు, గుర్రప్ప నాయుడు గంగాధరం, మరియు పారా స్టాఫ్ వరప్రసాద్, సచివాలయ సిబ్బంది, పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాడి రైతులకు మినరల్ మిక్సర్ ఉచితంగా అందజేశారు. తర్వాత ఎమ్మెల్యే ఆసుపత్రి ఆవరణలో చెట్లు నాటారు. అందజేశారు. అనంతరం రాచ రంగయ్య పల్లెలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దివంగత ఏంపరాల విశ్వనాథ నాయుడు ఉత్తర క్రియలో పాల్గొని ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


