SP Sneha Mehra : సురక్షిత ప్రయాణం క్షేమగమ్యానికి మార్గం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఐపీఎస్

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు, తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సురక్షిత ప్రయాణం – క్షేమంగా గమ్యానికి అవగాహన కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, మార్గదర్శకత్వంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, వారిలో ట్రాఫిక్ నిబంధనల పట్ల చైతన్యం కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి పొరపాట్లు ప్రాణంతకమవుతున్నాయని గుర్తుచేశారు. “Arrive Alive” కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రోడ్డుపై ప్రయాణించే ప్రతి వ్యక్తి క్షేమంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులు రేపటి పౌరులని, వారు రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ట్రాఫిక్ నిబంధనల అమలు కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ఇది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టాలని కోరారు. జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల నివారణకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Safe travel is the way to a safe destination District SP Sneha Mehra IPS

You cannot copy content of this page

Scroll to Top