మైనారిటీ నేత, మిత్రుడు జాఫర్ షరీఫ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్రంగా నన్ను కలిచివేసింది

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 17:నెల్లూరు జిల్లా.. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా సొంత అవసరాలు, వ్యక్తిగత పనుల మీద జాఫర్ షరీఫ్ మమ్మల్ని ఏనాడు కలవలేదు… జాఫర్ షరీఫ్ అంతిమయాత్రలో పాల్గొని,తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకు గౌరవసూచకంగా పాడె(జనాజ)ను మోసిన బీద రవిచంద్ర.. బీద రవిచంద్ర నా ఎం .ఎల్. సి,టీడీపీ జిల్లా అధ్యక్షులు, నెల్లూరు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మైనారిటీ నేత జాఫర్ షరీఫ్ పార్థివదేహానికి టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర నివాళులు అర్పించారు.
అనంతరం , అంతిమయాత్రలో పాల్గొని,తెలుగుదేశం పార్టీకి వారు చేసిన సేవలకు గౌరవసూచకంగా , పాడె(జనజా)ను మంత్రి నారాయణ,అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్ , రూప్ కుమార్ యాదవ్ లతో కలిసి బీద రవిచంద్ర తమ భుజస్కందాలపై మోశారు.
ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఉన్నది ఏ పార్టీ అయినా, ఆ పార్టీ అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా జాకీర్ నిలిచింది ప్రజల పక్షమే,ప్రజా సమస్యల పైనే. ఏం చేస్తే ముస్లిం సామాజికవర్గానికి మేలు చేకూరుతుంది,పథకాల్లో ఏం మార్పులు చేస్తే వారికి ప్రయోజనం చేకూరుతుందో వివరిస్తూ ప్రభుత్వానికి, ముస్లిం సామాజికవర్గంకు మధ్య జాకీర్ వారధిలా నిలిచారు.
నాలుగురోజుల క్రితం కూడా జాకీర్ నన్ను కలిసి సమయం కోరారు, పెద్ద పండుగ తర్వాత జనవరి 17 న కలుద్దామని అనుకున్నాం, కానీ అదే రోజు వారికి వీడ్కోలు పలకడం దుఃఖాన్ని మిగిలిచింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ కలిసినా, నన్ను కలిసినా అభివృద్ధి గురించే చర్చించేవారు జాకీర్. మరణం మంత్రి నారాయణ , తెలుగుదేశం పార్టీకే కాదు మాకు వ్యక్తిగతంగా తీరని లోటు. జరిగిన దుర్ఘటన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు , దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లడం, జాకీర్ కుటుంబ సభ్యులను , పరామర్శించడం జరిగింది.
ప్రజల కోసం, ముస్లిం సామాజికవర్గం కోసం, పార్టీ బలోపేతం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన జాకీర్ , కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో పాటు వ్యక్తిగతంగా మేము అండగా నిలుస్తాం. జాకీర్ ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను తోటి ప్రజా ప్రతినిధుల సహకారంతో సాధిస్తాం, ముస్లిం సామాజికవర్గం అభ్యున్నతితో వారికి ఘననివాళి అర్పిస్తాం. ఈ విషాదం నుండి కోలుకునే మనోధైర్యం వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The death of minority leader and friend Jaffer Sharif in a road accident

You cannot copy content of this page

Scroll to Top