త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 21,22వ డివిజన్లో కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు 21,22 డివిజన్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహించడం జరిగింది.. డిప్యూటీ కమిషనర్ నాయన వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో భాగంగా వీర్లపల్లి లక్ష్మీపురం ఎలకలపల్లి గేటు చైతన్యపురి కాలనీ ఏరియాలలో చెత్తను తొలగించి ప్రధాన కాలువలోని పూడికను తీసి వేయడం మరియు రోడ్డుకు ఇరువైపులో ఉన్న ముళ్ల పొదలను చెట్లను తొలగించడం జరిగింది మరియు డివిజన్లోని ప్రజలకు చెత్తను బయట వేయకుండా స్వచ్ఛ ఆటోలో మరియు మున్సిపల్ వాహనంలో తడి పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు బహిరంగ ప్రదేశాలలో ప్రధాన కాలువలో చెత్తను వేసిన జరిమానా విధించడం జరుగుతుందని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వచ్ఛత టీం సభ్యులతోపాటు ఏరియా సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం పర్యవేక్షకులు ఆడెపు శ్రీనివాస్ బండారి రవి సారయ్య సుగుణాకర్ ఉమామహేశ్వర్ యూసుఫ్ ఆర్పీలు సరోజన అనసూర్య రజిత స్నేహతో పాటు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


