ఈ సంక్రాంతి ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలి
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ
Trinethram News : నెల్లూరు, జనవరి 12 : తెలుగువారి పెద్ద పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం నింపే నిండైన పండుగ సంక్రాంతి అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మంత్రి నారాయణ తెలిపారు.
తెలుగు వారి వారసత్వానికి, మనుషులంతా కలిసి ఉంటే కలిగే ఆనందాలకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని, ఈ పండుగ అందరి కుటుంబాలలో అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలు కలుగ జేసి ఆనందంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రాంతి లక్ష్మి కరుణ కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


