Trinethram News : కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి 32 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో గ్రామస్తులు కట్టు బట్టలతోనే రోడ్డుపైకి వచ్చేశారు. గ్రామంలో ఉన్న పూరి ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశం.
సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అధికారులు నష్ట అంచనాలు వేస్తూ, బాధితులకు అవసరమైన సహాయం అందించే చర్యల్లో ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


