MP Harish Balayogi : ఇరుసుమండ బ్లోఔట్ బాధితులందరినీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ బ్లోఔట్ బాధితులను కూటమి ఆదుకుంటుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు.

మలికిపురం మండలం లక్కవరం గ్రామంలోని దొడ్డ కళ్యాణ మండపంలో బ్లోఔట్ బాధిత గ్రామస్తులతో ఎంపీ హరీష్ బాలయోగి, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ మాధవి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇరుసుమండ బాధిత గ్రామస్తులను ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం నష్ట పరిహారాన్ని అంచనా వేసిందన్నారు. అంతే కాకుండా గ్రామస్తులను ఆదుకోవడానికి ఏ విధంగా సహాయం చెయ్యాలో అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.

ఈ విపత్తును నివారించడానికి కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తూ, పూర్తిగా సహకరించిన గ్రామస్తులకు ఎంపీ హరీష్ బాలయోగి ధన్యవాదాలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Coalition government will support all Irusumanda blowout victims

You cannot copy content of this page

Scroll to Top