వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి,
- వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో పాల్గొన్న అనపర్తి మాజీ శాసనసభ్యులు
- అనపర్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై తీవ్ర విమర్శలు
- వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సూచన
- పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం
త్రినేత్రం న్యూస్, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆదేశాల మేరకు, తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అధ్యక్షతన దివాన్ చెరువులోని డీవీబీ రాజు కల్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలన ఏ స్థాయిలో కొనసాగుతోందో ప్రజలంతా ప్రత్యక్షంగా చూస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతి సందర్భంలో జక్కంపూడి రాజా, వేణు, తనకు పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచారని, తనలోని రెండో కోణాన్ని మరింత బలపరిచారని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పేర్కొన్నారు.
కూటమి పాలనలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని, కొన్ని ఘటనల్లో పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి తీవ్ర ఆవేదన కలిగించేదిగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలకు భద్రత కల్పించడం అత్యవసరమని, అందుకోసం వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పార్టీ తరుపున కార్యకర్తలకు పూర్తి భరోసా ఇచ్చి, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ధైర్యంగా ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


