త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట.. 09.01.2026 – శుక్రవారం.. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో రైతులకు ఉపయోగపడే అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ చేనేత మార్కెటింగ్ టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల, నాగేశ్వరరావు.రాష్ట్ర నీటిపారుదల సి.ఏ.డి ఆహార పౌర సంబంధాల శాఖల మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి.ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో సి.సి రోడ్ల నిర్మాణానికి బాలికల కోసం హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పథకం జాతీయ సహజ వ్యవసాయ మిషన్ ను అధికారికంగా ప్రారంభించారు.
భూసార,పరీక్షలు మొక్కల విశ్లేషణకు ఉపయోగపడే ఆధునిక ప్రయోగశాలను ప్రారంభించి సహజ వ్యవసాయంపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు వివరించారు వ్యవసాయ ఉత్పాదకత పెంపుదల ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకునే విధానాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి సూచనలను నేరుగా విని రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై స్పష్టత కల్పిస్తూ, వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం (రైతు మేళ) నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఐ.టి.డి.ఏ పిఓ బి. రాహుల్ భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు,జిల్లా స్థాయి ఉన్నత అధికారులు ఆయా శాఖల అధికార యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే తమ ధ్యేయమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


