Trinethram News : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తింది. దీంతో నలుగురితో కూడిన ఆస్ట్రోనాట్‌ల బృందం ఒక నెల ముందుగానే తమ మిషన్‌ను తగ్గించుకొని భూమిపైకి చేరుకుంటుందని నాసా ప్రకటించింది.
ఒక వ్యోమగామికి తీవ్రమైన అనారోగ్యం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర తరలింపు కాదని నాసా అధికారి ఒకరు తెలిపారు. అనారోగ్యానికి గురైన వ్యోమగామి పేరును నాసా వెల్లడించలేదు. ఇలా తమ మిషన్‌ను తగ్గించుకోవడం నాసా చరిత్రలోనే ఇదే తొలిసారి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


