Science Expo : శారద నీకేతన్ హై స్కూల్లో సైన్స్ ఎక్స్ పో – భవిష్యత్తు శాస్త్రవేత్తలకు ముందస్తు పరిచయం

TRINETHRAM NEWS

అరకులోయ జనవరి 9, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువ్యాలీ మండలం,శరభ గూడ గ్రామ పరిధిలోని “శారద నికేతన్ హై స్కూల్” (ఇంగ్లీష్ మీడియం)లో బుధవారం ఘనంగా నిర్వహించిన సైన్స్ ఎక్స్ పో కార్యక్రమం విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది.
శారద ట్రస్ట్ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సైన్స్ ఎక్స్ పో రెండు రోజుల పాటు కొనసాగుతుందని శారద ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రిబ్బన్ కటింగ్ చేసి సైన్స్ ఎక్స్ పోను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం పాఠశాల తరగతులను సందర్శించి, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు స్వయంగా రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు.
ఇంత చిన్న వయస్సులోనే విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు, సైంటిఫిక్ మెథడ్స్, వినూత్న ఆలోచనలు చూసి ఎమ్మెల్యే విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ప్రదర్శనలో విద్యార్థుల ఆలోచనా శక్తి, సృజనాత్మకత స్పష్టంగా కనిపించిందని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ,
“విద్యార్థుల సైన్స్ ఎక్స్ పోను అత్యంత అద్భుతంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు భవిష్యత్తులో సమాజానికి ఎంతో ఉపయోగపడేలా ఉన్నాయి. పిల్లలు చదువుతో పాటు ప్రయోగాత్మక విజ్ఞానం పెంపొందించుకుంటే రేపటి రోజుల్లో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు” అని అన్నారు.
విద్యార్థుల ప్రతిభను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన స్కూల్ టీచర్స్ కి, మరియు శారద ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికి తీస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్. నర్సింగరావు, అనంతగిరి జెడ్పిటిసి దిసరి గంగరాజు, స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కిలో సురేంద్ర, వి. ఉమామహేశ్వరరావు, స్కూల్ అడ్వైజర్ రోజా కిరణ్, స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.చిరంజీవులు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రభావతి, సి ఎస్ సుమిత్ర, ట్రస్ట్ సభ్యులు దామోదర్, చిన్నం నాయుడు, గౌరీ శంకర్, వి విజయ, బాబురావు, స్కూలు టీచర్స్, మరియు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Science Expo at Sharada Niketan High School

You cannot copy content of this page

Scroll to Top