భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జనవరి 06: (త్రినేత్రం న్యూస్) : అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం , పూచుకుంట గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ కొండ్రు బాబురావు మాట్లాడుతూ వాళ్లకు ఎంత మెజార్టీ వచ్చిందో , ఎన్ని వార్డులు గెలిచారో చెప్పారు. అదేవిధంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినందుకు ఆనందంగా ఉందని అన్నారు..
మా గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. నేను , సర్పంచ్ , గ్రామ వార్డులు అందరం కలిసి గ్రామ అభివృద్ధికి , ప్రజాసేవకు కృషి చేస్తామని సూచించారు.. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా ముందుంటామని, ఎల్లవేళలా మా గ్రామ ప్రజలకు, అభివృద్ధికి ఇష్టంతో పనిచేస్తానని వివరించారు.
అదేవిధంగా గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అడ్వాన్సుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు కలిగి ఉండాలని, వాళ్లు చేసేవృత్తులలో సిరిసంపదలు కలగాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, ఎటువంటి ఇభేదాలు లేకుండా, రాకుండా ,, నీతి, నిజాయితీ ధర్మం వైపు నిలబడాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పడం జరిగింది.
శాసనసభ్యులు జారే. ఆదినారాయణ ఎల్లవేళలా ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ల సమస్యలను పరిష్కరిస్తున్నారని, అటువంటి ఎమ్మెల్యే మాకు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


