డిండి సర్పంచ్. రవి
డిండి (గుండ్లపల్లి) జనవరి 06 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నవశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గ్రంధాలయము పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నవశక్తి యువజన సంఘం సభ్యుడు అయినా డిండి సర్పంచ్ నల్లగంతుల రవి పాల్గొని మాట్లాడుతూ…
దేవాలయం ఎంత పవిత్రమైనదో గ్రంథాలయం కూడా అంతే పవిత్రమైనదని అన్నారు. గ్రంథాలయం జ్ఞానోపదేశం చేసే ఒక దేవాలయం అని, జ్ఞానంతో సమాజంలో ఉండే ఒడిదుడుకులను, సమస్యలను ఎదుర్కోవడం సులభతరం అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కౌసర్ రషీద్ పాల్గొని గ్రంథాలయమును శుభ్రం చేయడం లో నవశక్తి యువజన సంఘం సభ్యులు ముందుకు రావడం మంచి పరిణామం అని అన్నారు. ఈ గ్రంథాలయమును యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నవశక్తి యువజన సంఘం అధ్యక్షులు లట్టుపల్లి శివ , ప్రధాన కార్యదర్శి సాయిబాబు, కోశాధికారి వెంకటేష్, సహాయ కార్యదర్శి మహేష్, ప్రవీణ్, సభ్యులు భరత్, బాల్ రాజ్ , మహేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


