త్రినేత్రం న్యూస్ :జనవరి 4: నెల్లూరు జిల్లా : కావలి మున్సిపాలిటీ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.48 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టనున్న పైప్లైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , ముఖ్య అతిథులుగా పాల్గొని పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, వెంగయాగారిపాలెం ప్రాంత ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టామని తెలిపారు.
ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


