Election of New Committee : బాలాజీ సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) జనవరి 04 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బాలాజీ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు రవీందర్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఆదివారం ఎన్నుకోవడం జరిగింది.

ఎన్నికలలో భాగంగా అధ్యక్షులుగా మూడవత్ వస్య ఉపాధ్యక్షులుగా మూడవత్ హనుమంతు,మల్లేష్ ప్రధాన కార్యదర్శి మూడవత్ సతీష్ శర్మ, కార్యదర్శి రమేష్ , కోశాధికారి పర్వతాలు, జైపాల్,క్రీడా కార్యదర్శి ధన్సిలాల్ ,లను ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా వస్య మాట్లాడుతూ బాలాజీ సేవా సంఘం అభివృద్ధికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని సూచించారు . ఈ కార్యక్రమంలో భాగంగా సలహాదారులుగా బాసు, రమేష్,ప్రవీణ్,సేవా, దశ్రు, సర్యా, శ్రీను,రామ్మోహన్, గోపాల్,సంతోష్,రాజ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Election of new committee

You cannot copy content of this page

Scroll to Top