New Year Celebrations : ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, తాడి గూడెం గ్రామంలో బైబిల్ మిషన్ చర్చి నందు ఘనంగా రెండు వేల ఇరవై ఆరు వ నూతన సంవత్సర వేడుకలు జరిగాయి.

సంఘ కాపరి రెవరెండ్. పి. పౌలు ఈ సంవత్సరం గురించి ప్రత్యేక బైబిల్ వాక్య పఠనం భక్తులకు వివరించారు.. నీతి గురించి భక్తి శ్రద్ధలు, ఎదుటివారితో ఎలా ప్రేమగా నడుచుకోవాలో సూచించారు.

అదేవిధంగా ఏసుప్రభు శాంతి, ప్రేమ, ఆప్యాయత గురించి తెలిపారు. సమాధానం ఎలా చెప్పాలో బోధించారు. అనంతరం కేకులు కట్ చేసి, నూతన సంవత్సర వేడుక దీవెనలు వచ్చిన సంఘ సభ్యులందరికీ అందించడం జరిగింది.

ఈ కార్యక్రమం చాలా సంతోషకరంగా జరిగిందని అక్కడికి వచ్చిన భక్తులందరూ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Year celebrations held grandly

You cannot copy content of this page

Scroll to Top