డిండి, (గుండ్లపల్లి)డిసెంబర్ 22, త్రినేత్రం న్యూస్. నూతన గ్రామ పంచాయతీల పాలకవర్గం ప్రమాణ స్వీకార ఉత్సవాలలో భాగంగా, డిండి మండలంలోని బొల్లనపల్లి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం చేత స్పెషల్ ఆఫీసర్, జ్యోతిలక్ష్మి, గ్రామ కార్యదర్శి కృష్ణ, సోమవారం ప్రమాణ స్వీకారం గావించారు. గ్రామ సర్పంచిగా గంగిడి స్వప్న మల్లారెడ్డి, ఉప సర్పంచ్ గా పేట కొండల్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంలో నూతన సర్పంచి స్వప్న మాట్లాడుతూ, గ్రామ పెద్దల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, వార్డు సభ్యుల మద్దతుతో, గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా ప్రభుత్వ పథకా లను ,సంక్షేమ పథకాలను, ఇతర అంశములను ,గ్రామానికి అందించుటకు తన వంతు కృషి చేస్తానని, గౌరవ దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతానని ఆమె అన్నారు.
తదనంతరం గ్రామస్తులు, బంధుమిత్రులు, సర్పంచి మరి ఇతర పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తహేర బేగం, కాంపల్లి అంజయ్య, బొల్లం కృష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గంగిడి ఆనందరెడ్డి, పిన్ని హరికృష్ణ ,కాకులవరం నరసింహారెడ్డి, సుజాత, బంధుమిత్రులు ,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


