MLA Kavya Krishna Reddy : బండి రెడ్డి వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 22 :నెల్లూరు జిల్లా: కావలి.. కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దేవరకొండ శీను బావగారు బండి రెడ్డి వెంకటేశ్వరరావు ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకొని, ప్రస్తుతం కావలి పట్టణం 34వ వార్డు వేలమూరి వారి స్ట్రీట్ లోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , సోమవారం వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు,డాక్టర్లు సూచించిన ఆహార నియమాలు, మందులు తప్పకుండా పాటిస్తూ, అవసరమైన విశ్రాంతి తీసుకోవాలని వెంకటేశ్వరరావుకు సూచించారు. అలాగే వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, హాస్పటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్ తో మాట్లాడి సహకారం అందించిన ఎమ్మెల్యే , కృతజ్ఞతలు తెలియజేసిన కుటుంబ సభ్యులు..ఈ కార్యక్రమంలో టీడీపి పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavya Krishna Reddy learns about Bandi Reddy

You cannot copy content of this page

Scroll to Top