Pulse Polio : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్య అధికారి డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, గోవిందయ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మరియు ఫీల్డ్ సిబ్బంది, ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు అందరూ పాల్గొన్నారు. తరువాత పెనుమూరు బస్టాండ్ వద్ద స్థానిక మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు సంవత్సరంలోపు పిల్లలందరూ పోలియో చుక్కలు వేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే రామకృష్ణాపురం పంచాయతీ అట్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అక్కడి సిబ్బంది ప్రారంభించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pulse Polio Program at Primary Health Center

You cannot copy content of this page

Scroll to Top