Trinethram News : నంద్యాల డిసెంబర్ 20 : నంద్యాల స్థానిక ఫరూక్ నగర్‌లో ముబారక్ చికెన్ మరియు ఎగ్ సెంటర్ తన 5వ నూతన బ్రాంచ్‌ను శనివారం అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ సంస్థ స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా (40వ వార్షికోత్సవం) ఈ సరికొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని ముబారక్ చికెన్ మరియు ఎగ్ సెంటర్ నిర్వాహకుడు మరియు 19వ వార్డు టిడిపి ఇంచార్జి షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) తెలిపారు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసి రెడ్డి ,ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ డైరెక్టర్ మణియార్ ఖలీల్ అహ్మద్ విచ్చేసి రిబ్బన్ కత్తిరించి షాపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నిరుద్యోగులు కేవలం ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా, ఇలాంటి స్వయం ఉపాధి రంగాలలో రాణించడం అభినందనీయమన్నారు. ముబారక్ చికెన్ సెంటర్ వారు నాణ్యమైన చికెన్ మరియు గుడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ, వ్యాపార పరంగా ఈ సంస్థ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఫయాజ్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా నాణ్యమైన చికెన్ మరియు గుడ్లను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నామని, వారి ఆదరణతోనే నేడు 5వ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎన్జీవో కాలనీలో మెయిన్ బ్రాంచ్ ఉండగా, బొమ్మలసత్రం, గిరినాథ్ సెంటర్, వెలుగుడు ప్రాంతాలలో కూడా తమ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


