కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…..
Trinethram News : గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అందులో భాగంగా అంగన్ వాడీ వ్యవస్థలో ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 285 మంది ఐసీడీఎస్ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. శుక్రవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఐసీడీఎస్ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను పంపిణీ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా నాలుగు మండలాల నుంచి నలభై మందికి ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవల్లో వేగం, పారదర్శకతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందులో భాగంగా అంగన్ వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను అందించడం జరిగిందన్నారు. వీటి సహకారంతో పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ వ్యవస్థ దోహదపడుతుందన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన 4జీ స్మార్ట్ ఫోన్లు సరిగ్గా పని చేయలేదన్నారు. అందుకే 5జీ నెట్వర్కుతో ఉన్న స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నామని తెలియజేశారు.అంగన్ వాడీ కార్యకర్తలకు జీతాన్ని రూ.11,500లకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మినీ అంగన్ వాడీలను అంగన్ వాడీ కేంద్రాలుగా మార్చిన ఘతన కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. ఐసీడీఎస్ సిబ్బంది అంకితభావంతో పని చేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్,ధరణాల రామకృష్ణ,మిద్దె ఆదినారాయణ,కేతా శ్రీనివాస్, బండారు వీరబాబు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


