Minister N.M.D. Farooq : నంద్యాలలో శ్రీ వెంకటేశ్వర కళామండలి ఆధ్వర్యంలో నిర్వహించు ఉచిత పౌరాణిక నాటక ప్రదర్శన పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రివర్యులు ఎన్ఎండీ ఫరూక్

TRINETHRAM NEWS

నంద్యాల డిశంబర్ 15 : నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్.ఎమ్.డి. ఫరూక్ ని నంద్యాల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కళామండలి (ఉచిత పౌరాణిక నాటక ప్రదర్శన కమిటీ) సభ్యులు పాలగిరి శివరామిరెడ్డి , సూర్య బాబు, మధుసూదన్, జిల్లాల శ్రీరాములు మర్యాదపూర్వకంగా వారి నంద్యాల క్యాంపు కార్యాలయం నందు కలిసి ఉచిత పౌరాణిక నాటక ప్రదర్శన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కళామండలి సంఘం నంద్యాల వారి ఆధ్వర్యంలో 16-12-2025, మంగళవారం రాత్రి 9:00 గంటలకు నంద్యాల విక్టోరియా రీడింగ్ రూమ్ నందు నిర్వహించనున్న పౌరాణిక నాటక ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఫరూక్ ఆవిష్కరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ministers NMD Farooq unveils poster of free mythological drama performance

You cannot copy content of this page

Scroll to Top