త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 15: నెల్లూరు జిల్లా: కావలి : అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి (ఆత్మర్పణ దినం) సందర్భంగా కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ,పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యమైందని గుర్తుచేశారు,పొట్టిశ్రీరాములు ఆశయాలను మనమందరం చూచా టప్పకుండా పాటిద్దాం అని తెలిపారు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,వాసవి క్లబ్ సేవన్ లైన్స్ సభ్యులు,ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని అమరజీవికి ఘన నివాళులు అర్పించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


