Mandakrishna Madiga : కోదాడ దళిత యువకుడి మృతి పోలీసులపై మర్డర్, ఎస్సీ–ఎస్టీ కేసులు నమోదు చేయాలి మందకృష్ణ మాదిగ

TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసల వల్ల మృతి చెందిన ఘటనపై సంబంధిత పోలీసులపై మర్డర్ కేసుతో పాటు ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లాలోని న్టీపీసీ , జ్యోతి భవన్ లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్‌ రాజేష్ తల్లి లలితమ్మతో కలిసి మార్పస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య మందకృష్ణ మాదిగ ,జననేత టీపీసీసీ నాయకులు శ్యామ్ కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, ఎలాంటి ఫిర్యాదు లేకుండానే నవంబర్ 4 నుంచి 10 వరకు రాజేష్‌ను అక్రమంగా పోలీస్ కస్టడీలో ఉంచి తీవ్ర చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు.

చట్టవిరుద్ధమైన కస్టడీ, తగిన వైద్యం అందించకపోవడమే రాజేష్ మృతికి కారణమని తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాలు పూర్తిగా అసత్యమని అన్నారు బాధితుడి తల్లి మూడుసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ,ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం దళిత కుటుంబంపై జరుగుతున్న వివక్షేనని విమర్శించారు. ఈ ఘటనపై చిలుకూరు ఎస్సై, కోదాడ రూరల్ సిఐలను తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాజేష్ మృతదేహానికి నిపుణులైన ఫోరెన్సిక్ వైద్యులతో రీ–పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు అలాగే చిలుకూరు, కోదాడ రూరల్, అనంతగిరి పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్‌లు, రాజేష్ పని చేసిన పెట్రోల్ బంక్ వీడియో ఫుటేజ్‌లు, ఈ కేసులో సహ నిందితుల కాల్ డేటా బయటపెడితే నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. జాతీయ ఎస్సీ కమిషన్ కోదాడకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

 Murder, SC-ST cases should be registered against the police Mandakrishna Madiga

You cannot copy content of this page

Scroll to Top