త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. మర్పల్లి స్థానిక సంస్థల రెండవ విడత ఎన్నికల నేపథ్యంలో మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు అనన్యతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకొని అభివృద్ధి లో భాగస్వాములు కావాలన్నారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్ , కూతుళ్లు సువర్ష,ప్రవర్ష, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మదుగు రామేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కలిముద్దీన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి జగదీష్, జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పరి నాగేష్, దివాకర్, నిఖిల్, రియాజ్, రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


